ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దిచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సీఐ అజయ్ బాబు మీడియాకు తెలిపారు. నిందితులపై గతంలోనే క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.