ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి, మలేరియాపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మధుసూదన్రావు మాట్లాడుతూ, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల హెల్త్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.