సింగరాయకొండ - Singarayakonda

మంచిర్యాల జిల్లా
రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ నాయకులు
Mar 07, 2026, 09:03 IST/మంచిర్యాల
మంచిర్యాల

రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ నాయకులు

Mar 07, 2026, 09:03 IST
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు అధ్యక్షతన, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఎకరాల లోపు రైతులకు మాత్రమే భరోసా ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేసిందని, వెంటనే ఎగ్గొట్టిన మూడు విడుదల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోపు రైతు భరోసా పూర్తిగా విడుదల చేయకపోతే, మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడటానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు.