Jan 26, 2026, 12:01 IST/
డబ్బు కోసం మహిళను చంపి పూడ్చి పెట్టిన తండ్రి, కొడుకులు
Jan 26, 2026, 12:01 IST
TG: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్)లో దారుణం చోటుచేసుకుంది. అప్పుల బాధతో రాములు, ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి కుమార్ కలిసి 67 ఏళ్ల వ్యవసాయ కూలీ సుంకిరెడ్డి అనసూయమ్మను దారుణంగా హత్య చేశారు. రేషన్ బియ్యానికి ఇవ్వాల్సిన 300 రూపాయలు ఇస్తామని చెప్పి అనసూయమ్మను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు రప్పించి, ఆమె తలపై కొట్టి, గొంతు కోసి, నాలుగు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. అనంతరం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే మృతదేహాన్ని పూడ్చివేశారు.