Feb 16, 2026, 02:02 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా? ఉత్కంఠ!
Feb 16, 2026, 02:02 IST
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడే అవకాశం ఉంది. బీజేపి, బీఆర్ఎస్ చెరో నాలుగు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ తో కలిపి నాలుగు స్థానాలకు చేరుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ 7 ఉండగా, ఏ పార్టీకి సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలున్నాయి. బీజేపి, బీఆర్ఎస్ ల మధ్య జరిగిన మంతనాలు సయోధ్య కుదరకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.