
మంచిర్యాల
లక్షెట్టిపేట: నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, ప్రక్రియను పరిశీలించారు. ఈ నెల 30వ తేదీ వరకు 15 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.




