రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు

6చూసినవారు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కలవకుంట గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, తనది గిద్దలూరు అని చెబుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :