ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దూపాడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ హబీ బున్నీసా మృతి చెందారు. విధుల నిమిత్తం ఫీల్డ్ ఆఫీసర్ తో కలిసి బైక్ పై వెళ్తుండగా, సోమేపల్లి వద్ద అకస్మాత్తుగా బైక్ ముందుకొచ్చిన ముంగిసను తప్పించబోయి బైక్ స్కిడ్ అయింది. దీంతో మేనేజర్ బున్నీసా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.