చెట్టుకు ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

6చూసినవారు
చెట్టుకు ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న ఘటనలో నందికొట్కూరుకు చెందిన భరత్ (23) మృతి చెందాడు. భరత్ తన నలుగురు స్నేహితులతో కలిసి నందికొట్కూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా రోళ్లపెంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు వేగం అదుపుతప్పి వాగులోకి దూసుకువెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మిగిలిన నలుగురు స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై వెంకటరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్