తుఫాను వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

6చూసినవారు
మంతా తుఫాన్ వరద బాధితులకు దోర్నాలలో శనివారం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. తుఫాను సందర్భంగా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యవసర వస్తువులను అందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని ఏరీక్షణ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే నష్టం తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్