ప్రకాశం జిల్లా దోర్నాలలో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, గత ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు.