ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడటంతో దూదేకుల రసూల్ అనే యువ రైతు ఏడు ఎకరాల మిర్చి పంటను కోల్పోయాడు. పొలమంతా బండరాళ్ళతో నిండిపోవడంతో, అధికారులు స్పందించలేదని ఆవేదన చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.