మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త గుడి వేముల గ్రామ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాలివానకు రోడ్డుపై కూలిన చెట్టును తప్పించే ప్రయత్నంలో తుఫాను వాహనం పక్కనే ఉన్న ఎండిన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తుఫానులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వినుకొండకు తరలించారు.