మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం యూత్ ట్రైనింగ్ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 60 మంది చెంచు మహిళలకు ఐటిడిఏ ద్వారా శుక్రవారం ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లు, ఉచిత శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.