మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు వద్ద ఇసుక లోడ్ తో వెళుతున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మూల మలుపు వద్ద ఆగిపోయింది. దీంతో రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ, టూరిస్ట్ బస్సుల్లోని ప్రయాణికులు, పిల్లలు ఆకలితో అలమటించారు. పోలీసులు లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.