మార్కాపురం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

24చూసినవారు
మార్కాపురం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల గ్రామ శివారులోని తీగలేరు కాలువలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం కలకలం సృష్టించింది. స్థానిక రైతుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం సమీపంలో పురుగుమందు డబ్బా లభించడంతో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు 60 సంవత్సరాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్