వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని, వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం చేశారని మాజీ సీఎం జగన్‌పై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే, జగన్ గొడ్డళ్లతో రక్తం పారిస్తున్నారని ధ్వజమెత్తారు.