అదృశ్యమైన దంపతులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

8చూసినవారు
అదృశ్యమైన దంపతులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
యర్రగొండపాలెంకు చెందిన గోపిదేశి వెంకట లక్ష్మీనారాయణ, పద్మ దంపతులు ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వారి కుమారుడు వెంకట రఘనాథ్, తల్లిదండ్రుల ఆచూకీ కోసం బంధువుల ఇళ్లు, ఆలయాలు, సత్రాలు సహా అనేక చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో అతను యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై దేవ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన దంపతులను త్వరగా గుర్తించి వారి కుమారుడికి అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్