
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎన్నిరోజులంటే?
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఈ నెల 18 వరకు సెలవులు కొనసాగుతాయి. 19న (సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న (శనివారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.




