వెలుగొండ ప్రాజెక్టు పరిశీలించిన నిమ్మల రామానాయుడు

1చూసినవారు
మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టును మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పనులు నెమ్మదించడంపై నిర్మాణ సంస్థపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, కార్మికుల కొరత అధికమించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 సీజన్ నాటికి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు నీరు అందించాలని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని, అందుకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్