ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం యర్రగొండపాలెం రేంజ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్ విస్తరణ కార్యక్రమం జరిగింది. స్థానిక వృక్ష జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్ ను అనుకూల ప్రాంతాల్లో విస్తరించి, అటవీ విస్తరణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పాటు అందించారు. 'ఒక్క సీడ్ బాల్ ఒక పచ్చని భవిష్యత్' అని, ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రేంజర్ ప్రసన్న జ్యోతి కోరారు.