త్రిపురాంతకం వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డాడు. కారు ఎయిర్ బెలున్లు తెరుచుకోవడంతో కారు డ్రైవర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, ట్రాక్టర్ ముందు భాగంలోని రెండు టైర్లు ఊడి పక్కన పడ్డాయి.