నేలకొరిగిన రేకుల షెడ్లు

0చూసినవారు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో 15 ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోవడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లలోని బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులు వర్షంలో తడిసి పాడయ్యాయి. బాధితులు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్