పాలుట్ల రహదారిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్లు

3చూసినవారు
యర్రగొండపాలెం మండలంలో మొంథా తుఫాన్ కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో వరద తాకిడికి పాలుట్ల గ్రామానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చేరాల్సిన రేషన్ బియ్యం లారీలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో, అధికారులు 4 ట్రాక్టర్ల ద్వారా బియ్యాన్ని తరలించారు. మార్గమధ్యలో కొన్ని ట్రాక్టర్లు వాగులో చిక్కుకున్నప్పటికీ, గ్రామస్థుల సహాయంతో అతికష్టం మీద బియ్యాన్ని పాలుట్లకు చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్