త్రిపురాంతకం: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

562చూసినవారు
త్రిపురాంతకం: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బుధవారం అక్రమ రేషన్ బియ్యం రవాణాను ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అడ్డుకున్నారు. ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. బియ్యాన్ని స్థానిక ప్రభుత్వ గోదాములకు తరలించారు.

సంబంధిత పోస్ట్