ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రం ఎస్సీ పాలెం గ్రామంలో క్రిస్మస్ పండగ సందర్భంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.