మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో గురువారం
వైసీపీ నాయకులు వెన్నుపోటుకు రెండేళ్లు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను చంద్రబాబు మోసగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.