ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంటా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, పలు ప్రాంతాలలో నీటి బోర్ల నుంచి నీరు ఉబికి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత 48 గంటల పాటు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి, చెరువులు నిండాయి. భూగర్భ జలాలు పెరగడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ దృశ్యాలను గురువారం సోషల్ మీడియాలో పంచుకున్నారు.