ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు కీలక వ్యక్తి ప్రణయ్ ప్రకాశ్‌ను నేపాల్‌లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద అరెస్టు చేశారు. A52గా ఉన్న ప్రణయ్ ప్రకాశ్‌పై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అతన్ని నేపాల్‌లోని మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అరెస్టుతో లిక్కర్ స్కామ్‌లో మొత్తం అరెస్టుల సంఖ్య 17కు చేరింది.