శనగ పంట కోత దశకు చేరుకుంది. రైతులు సరైన సమయంలో పంట కోయడం ద్వారా నాణ్యమైన దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు. కాయలు గోధుమ రంగులోకి మారి, ఆకులు రాలిపోయినప్పుడు పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. కూలీలతో లేదా కంబైన్ హార్వెస్టర్‌తో కోయవచ్చు. యంత్రాలు వాడే ముందు శుభ్రం చేసుకోవాలి. కోత సమయంలో వర్షం, తేమ ఉంటే కీటకాలు, శిలీంధ్రాలు ఆశించే ప్రమాదం ఉంది. నిల్వ సమయంలో తేమ శాతం 10-12% ఉండేలా చూసుకోవాలి. గదిలో తేమ, ఉష్ణోగ్రతలు నియంత్రించాలి. విత్తనాలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే నిల్వ చేయాలి.