35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడాన్ని 'అడ్వాన్స్‌డ్ మెటర్నల్ ఏజ్ ప్రెగ్నెన్సీ'గా పరిగణిస్తారు. ఈ వయస్సులో అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం, శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. గర్భధారణకు ముందు థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, పోషకాహార లోపాల వంటి
పరీక్షలు చేయించుకోవడం, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.