ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

18343చూసినవారు
ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్
AP: రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో పాటు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనకాపల్లి, మదనపల్లె, ప్రకాశం జిల్లాల్లో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలపాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్