AP: ప్రభుత్వ విద్యుత్తు సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగం, బిల్లింగ్‌లో పారదర్శకత పెంచేందుకు వీటిని ప్రీపెయిడ్‌గా మార్చారు. ఈ విధానంతో బకాయిల సమస్య తగ్గి, వినియోగంపై నియంత్రణ పెరుగుతుంది. మొత్తం 71,174 సర్వీసుల్లో సుమారు 50 వేల సర్వీసులు ఈ విధానంలోకి మారాయి.