ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ముర్ము పర్యటన

34చూసినవారు
ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ముర్ము పర్యటన
AP: విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి, కార్యక్రమం అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె బెంగళూరుకు బయలుదేరారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఏపీ గవర్నర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా, కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్