కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఆర్టికల్ 356 కింద విధించిన పాలనను ఉపసంహరించినట్లు వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత విధించిన రాష్ట్రపతి పాలనను అధికారికంగా ఎత్తివేశారు. మణిపూర్ తదుపరి సీఎంగా మాజీ స్పీకర్, సీనియర్ నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎంపికయ్యారు.