AP: గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారని,
వైసీపీ హయాంలో వ్యవస్థలను అవినీతిమయం చేశారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. మద్యం పాలసీ ద్వారా
జగన్ రూ.3200 కోట్లు దోచుకున్నారని, కల్తీ మద్యం కారణంగా అనేక మంది చనిపోయారని ఆయన అన్నారు. అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై
వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టిందని, దోపిడీని ఎవరు బయటపెట్టినా వారికి మతిస్థిమితం లేదనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను అనుమతించలేదని, మద్యం స్కామ్‌కు తాడేపల్లి ప్యాలెస్ నుంచే బీజం పడిందని ఆయన పేర్కొన్నారు.