హ్యుందాయ్ కార్లపై ధరల పెంపు.. మే నుంచి అమలు

5755చూసినవారు
హ్యుందాయ్ కార్లపై ధరల పెంపు.. మే నుంచి అమలు
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్, మే నెల నుండి తమ కార్ల ధరలను 1% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వివిధ వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కార్ల మోడళ్లు, వేరియంట్ల ఆధారంగా ధరలు మారతాయని, వినియోగదారులపై భారం మోపే ఉద్దేశం లేదని పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో 2,08,275 యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇది దేశీయ విక్రయాల్లో రికార్డు అని హ్యుందాయ్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్