AP: కాకినాడ జిల్లా ఓ ఘటన కలకలం రేపింది. జార్జిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై ఓ స్థానికుడు కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో అర్చకుడి భుజం, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు కోరంగి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.