ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింతాంగ్ ఆదిపూర్ణ’ లభించింది.
భారత్-ఇండోనేషియా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గానూ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. దేశ ఐక్యత, శ్రేయస్సుకు విశేష సేవలందించిన వారికి ఇచ్చే అత్యున్నత జాతీయ పతకాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో బహూకరించారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.