నేడు ఏపీలో మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో జరిగిన జీఎస్టీ బడ్జెట్ ఉత్సవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నవరాత్రి ముందు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తెచ్చామని, ఇప్పుడు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.