ప్రధాని మోడీ ఓదార్పు ఉపశమనం కలిగించింది: మంత్రి నాదెండ్ల

41చూసినవారు
ప్రధాని మోడీ ఓదార్పు ఉపశమనం కలిగించింది: మంత్రి నాదెండ్ల
AP: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ, నాదెండ్ల మనోహర్‌కు ప్రధాని ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధాని పంపిన ఈ ఓదార్పు లేఖపై నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఈ తీరని లోటు సమయంలో ప్రధాని మోదీ పంపిన లేఖ, ఆయన పలికిన ఓదార్పు మాటలు తమకు ఎంతో ధైర్యాన్ని, ఉపశమనాన్ని కలిగించాయని, తమ కుటుంబం ఆయన ఆత్మీయతకు రుణపడి ఉంటుందని భావోద్వేగంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్