
సోషల్ మీడియా పరిచయం.. మహిళపై 7 ఏళ్లుగా అత్యాచారం!
కోల్‌కతాలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి గత ఏడేళ్లుగా తనపై లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దర కలిసి పలుమార్లు వివిధ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడనిm ఈ క్రమంలో తీసిన ఫోటోలు, వీడియోలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మెటియాబ్రూజ్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితుడు బ్రహ్మపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును బన్స్‌ద్రోని PSకు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




