ప్రభుత్వ ఉద్యోగులు సోషల్‌ మీడియా వాడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి: బిహార్‌ సర్కార్

6738చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్‌ మీడియా వాడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి: బిహార్‌ సర్కార్
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్‌ మీడియా వినియోగంపై బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టే ముందు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, అధికారిక సమాచారం అనుమతి లేకుండా షేర్‌ చేయరాదని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్