మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కుట్ర: జగన్

57చూసినవారు
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కుట్ర: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని గురువారం సందర్శించిన ఆయన, “పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం కుట్ర” అని అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు అధిక ఛార్జీలు వసూలు చేయడంతో పేదలకు వైద్యం అందడం కష్టమవుతుందని, అందుకే ప్రభుత్వ కాలేజీలు అవసరమని చెప్పారు. తమ పాలనలో ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్