వర్షం, ఈదురుగాలుల వల్ల సమస్యలు వచ్చాయి: మంత్రి గొట్టిపాటి

100చూసినవారు
వర్షం, ఈదురుగాలుల వల్ల సమస్యలు వచ్చాయి: మంత్రి గొట్టిపాటి
AP: రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలుల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్త సందేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.