రేషన్‌ కార్డుదారులకు ఇబ్బందులు

112చూసినవారు
రేషన్‌ కార్డుదారులకు ఇబ్బందులు
AP: పేదలకు తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రాయితీపై నిత్యావసర సరుకులు అందిస్తోంది. అయితే రాష్ట్రంలో గత కొంతకాలంగా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా జరగడం లేదు. గోధుమ పిండి, రాగులు, జొన్నలు, బియ్యం, చక్కెర అందిస్తున్న ప్రభుత్వం.. కందిపప్పును మాత్రం అందుబాటులో ఉంచలేదు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర పెరడంతో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కందిపప్పు కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్