చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అగ్ర నిర్మాత దిల్ రాజు వివరించారు. ఒకప్పుడు 36 శాతం వడ్డీ వసూలు చేసే ఫైనాన్సియర్లు, ఇప్పుడు 24 శాతానికి వచ్చారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సొంత పెట్టుబడి, బ్యాంక్ రుణాలు, నాన్-థియేట్రికల్ బిజినెస్, బయటి ఫైనాన్స్ అనే నాలుగు మార్గాల ద్వారా నిధులు సమకూరుతాయని చెప్పారు. బ్యాంకులు ఆస్తులను చూసి రుణాలు ఇస్తాయని, నిర్మాతలు తమ పర్సనల్ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. 100 కోట్ల ఫైనాన్స్ తీసుకుంటే సంవత్సరానికి 24 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని, ఇది నిర్మాతలకు భారమన్నారు. నటులు, టెక్నీషియన్లు, ఫైనాన్సియర్లే సేఫ్ జోన్‌లో ఉంటారని, లాభాలు వస్తే చిట్టచివరిగా మిగిలేదే నిర్మాతకు దక్కుతుందన్నారు.