AP: ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ప్రొఫెసర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ల్యాబ్‌కు హాజరుకాలేదని ఎంటెక్ విద్యార్థి వినయ్‌ని ప్రొఫెసర్ గోపాలరాజు ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంటెక్ విద్యార్థి వినయ్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.