నేటి నుంచి విజయవాడ నగరంలో నిషేధాజ్ఞలు అమలు

27చూసినవారు
నేటి నుంచి విజయవాడ నగరంలో నిషేధాజ్ఞలు అమలు
AP: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం శనివారం నుంచి ఏప్రిల్ 9 వరకు పోలీస్ యాక్ట్ 1861లోని సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. పోలీసు కమిషనర్ వి.రాజశేఖర బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల అనుమతి తప్పనిసరి. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్