న్యూయార్క్ సిటీలో రష్యాకు చెందిన ఓ జంట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైనున్న ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కి 'ప్రపంచ శాంతి' సందేశం ఉన్న బ్యానరును ప్రదర్శించారు. అనంతరం టవర్ కిందకు దిగి (1,454 అడుగుల ఎత్తులో) అక్కడ ఉన్న ఫ్లాట్ ఫారమ్ పై సదరు వ్యక్తి తన ప్రేయసీకి ప్రపోజ్ చేశాడు. వీరి చర్యలను గమనించిన న్యూయార్క్ పోలీసులు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకొని ఆ జంటను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.